నడిచొచ్చి.. క్యూలైన్​ లో నిల్చొని ఓటేసిన మోదీ

By udayam on December 5th / 5:15 am IST

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లో రాణిప్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని ఓటేశారు. రాణిప్‌లోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు వచ్చి కాన్వాయ్ ను కొంతదూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్‌ కేంద్రం వరకు వెళ్లారు.అనంతరం పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.గుజరాత్‌ సిఎం భూపేంద్ర అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ట్యాగ్స్​