బెర్లిన్​లో మోదీకి ఘన స్వాగతం

By udayam on May 2nd / 7:10 am IST

నాలుగు రోజుల యూరప్​ పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈరోజు జర్మనీలోని బెర్లిన్​లో ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్​లర్​గా ఓలాస్​ స్కాల్జ్​ ఎన్నికైన తర్వాత మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. యూరప్​లో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మోదీ జరుపుతున్న ఈ పర్యటనపై ప్రపంచ దేశాలతో పాటు రష్యా, ఉక్రెయిన్​లు సైతం ఓ కన్నేసి ఉంచాయి.

ట్యాగ్స్​