తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న సికింద్రాబాద్ లో వందే భారత్ రైలును మోడీ ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు స్టేట్ బీజేపీ ప్రకటించింది. బిజీ షెడ్యూల్ కారణంగానే మోడీ పర్యటన వాయిదా పడనట్లు తెలుస్తోంది. అయితే ఇదే నెలలో మరో రోజు తెలంగాణలో మోడీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మరో వైపు ఈ నెలలోనే అమిత్ షా, మోడీ, ఫిబ్రవరిలో జేపీ నడ్డా టూర్ లు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.