జపాన్‌లో జరుగుతున్న క్వాడ్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో క్లోజ్డ్ డోర్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత నెల 11న ఈ ఇరువురు నేతలు వర్చువల్‌గా మాట్లాడుకున్నారు. అప్పట్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రపంచవ్యాప్త పరిణామాల గురించి సైతం వీరివురూ అభిప్రాయాలను పంచుకున్నారు.
Had a productive meeting with @POTUS @JoeBiden. Today’s discussions were wide-ranging and covered multiple aspects of India-USA ties including trade, investment, defence as well as people-to-people linkages. pic.twitter.com/kUcylf6xXp
— Narendra Modi (@narendramodi) May 24, 2022