అహ్మదాబాద్ – సూరత్ మెట్రో లకు మోదీ భూమిపూజ

By udayam on January 18th / 10:04 am IST

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ జరిపారు.

గుజరాత్‌లో రెండు ప్రముఖ పట్టణ కేంద్రాలకు ఈరోజు చారిత్రకమైన రోజని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టులతో ఈ రెండు నగరాలకు పర్యావరణ హితకర ‘మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం’ అందుబాటులోకి వస్తుందని అన్నారు.

2014కు ముందు 10-12 ఏళ్ల వ్యవధిలో కేవలం 225 కిలోమీటర్ల మెట్రో లైను అందుబాటులోకి వస్తే గత ఆరేళ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ కార్యరూపంలోకి వచ్చిందని వివరించారు.