యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షునిగా మేక్రాన్ రెండోసారి గెలిచిన నేపధ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాల మీద ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ యూరప్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి బయల్దేరనున్నారు.