4:11 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

రూ.75 స్మార‌క నాణాన్ని లాంచ్ చేసిన మోదీ 2 weeks ago

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75 వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 రూపాయల స్మార‌క నాణాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఎఫ్ఏవో తో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేస్తూ ఈ నాణాన్ని విడుదల చేశారు. ప్రత్యేకమైన ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉండదు.

అలాగే నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇటీవల అభివృద్ధి చేసిన 17 ర‌కాల బయోఫోర్టిఫైడ్ పంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ ఈ ఏడాది నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెల్చుకోవడం గొప్ప విష‌య‌ని ప్రశంసించారు.

ఆహార స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త పాత్ర‌, భాగ‌స్వామ్యం చ‌రిత్రాత్మకమైన అంశంగా ప్రధాని పేర్కొన్నారు. బలహీన వర్గ ప్రజలను, ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో ఎఫ్ఏఓ ప్రయాణం అసమానమైనదన్నారు. 2016 లో అంతర్జాతీయ పప్పు ధాన్యాలు సంవత్సరంగా అలాగే , 2023 ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇయ‌ర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్ర‌క‌టించింద‌ని, ఇందుకు భారత్ మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుంద‌ని మోదీ చెప్పారు.