తల్లి మృతిపై ప్రధాని భావోద్వేగ సందేశం

By udayam on December 30th / 6:00 am IST

తన తల్లి హీరాబెన్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోడి భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ” నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా ” అని ప్రధాని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో నిన్న అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.

ట్యాగ్స్​