భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు ఈరోజు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు డిఫెన్స్, రక్షణ రంగాల్లో సహకారం పైనా వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలతో ముగించాలంటూ ప్రధాని మరోసారి పుతిన్ కు సూచించారు. ఎనర్జీ కో ఆపరేషన్, వర్తకం, పెట్టుబడులు, రక్షణ రంగాలపైనా చర్చలు జరిగాయి.