మోదీ: మాస్క్​ ధరించడం మానొద్దు

By udayam on December 23rd / 6:08 am IST

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌-7 విజృంభిస్తోందన్న కథనాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం వర్చువల్‌ పద్ధతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాకపోయినా..ధరించడమే మంచిదని దేశ ప్రజానీకానికి ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశించారు. అలాగే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. నిఘాను పటిష్టం చేయాలని సూచించారు.

ట్యాగ్స్​