కర్ణాటక: ప్రధాని మోదీ తమ్ముడి కారుకి రోడ్డు ప్రమాదం

By udayam on December 27th / 1:08 pm IST

ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్​ మోదీ కి కర్ణాటకలోని మైసూర్​ నగరంలో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్​ ను ఢీకొట్టడంతో కారులో ఉన్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో 69 ఏళ్ళ ప్రహ్లాద్​ తో పాటు ఆయన కొడుకు, కోడలు, మనువడు కూడా ఉన్నారు. రోడ్డు డివైడర్ ను కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులను మైసూరులోని జేఎస్ హాస్పిటల్ కు తరలించారు.

ట్యాగ్స్​