సెంట్రల్​ విస్టాలో ఆదివారం రాత్రి ప్రధాని తనిఖీ

By udayam on September 27th / 8:58 am IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క నిమిషం కూడా వృధా చేయరనడానికి ఈ ఘటనే నిదర్శనం. అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడిపి భారత్​కు వచ్చిన ఆయన వెంటనే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్​ భవన పనులను తనిఖీ చేయడానికి వెళ్ళారు. సెంట్రల్​ విస్టా పేరుతో నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్​లో జరుగుతున్న పనుల వివరాలను అక్కడి కార్మికులను, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు ఆయన అక్కడకు వెళ్ళి దాదాపు 1 గంట పాటు అక్కడి పనులను పరిశీలించారు.

ట్యాగ్స్​