4న భీమవరానికి ప్రధాని మోదీ

By udayam on July 2nd / 6:42 am IST

ఈనెల 4న భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన ఖరారైంది. ఈరోజు హైదరాబాద్​లో జరగనున్న బిజెపి కార్యవర్గ సమావేశాలకు హాజరు కానున్న ఆయన 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అనంతరం ఎపికి బయల్దేరనున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరయిన అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానికి ఎపి సిఎం జగన్​ స్వాగతం పలికి.. అనంతరం ఆయనతో కలిసి భీమవరానికి ప్రత్యేక హెలికాఫ్టర్​లో రానున్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది.

ట్యాగ్స్​