వరవరరావుకి బెయిల్ మంజూరు

By udayam on February 22nd / 2:53 pm IST

ముంబై: ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విరసం నేత వరవరరావు (81) కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు వెల్లడించింది. అయితే ముంబై విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కోర్టు తెలిపింది.

కాగా వరవరరావును 2018 జూన్‌ 18న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే ఇటీవల వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతింది. కరోనా కూడా సోకడంతో పాటు నరాల సంబంధిత ఇబ్బందులు.. ఇతర సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు.

ట్యాగ్స్​