పోలవరం ప్రాజెక్టులో దిగువకాఫర్ డ్యామ్ డయాఫ్రం వాల్ పనులు పూర్తయ్యాయి. 2019లో వచ్చిన గోదావరి వరదలతో ఇసుక భారీగా కోతకు గురికావడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తీవ్రమైన అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో పటిష్టంగా దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయాలంటే ముందు డయాఫ్రం వాల్ తప్పనిసరి అని జలవనరులశాఖ నిర్ధారించింది. దీంతో మేఘా కంపెనీ 160 మీటర్ల మేర డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తి చేసింది. జియో బ్యాగులతో ఇసుకను నింపి వైబ్రో కంప్రెసర్ ద్వారా డయాఫ్రంవాల్‌ను పటిష్టపరిచారు.