కొలంబోలో చెలరేగుతున్న హింస

By udayam on May 9th / 10:48 am IST

శ్రీలంక రాజధాని కొలంబోలో సోమవారం తీవ్ర హింస చెలరేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వర్గంపై ప్రధాని మహింద రాజపక్స మద్దతు దారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. నిరసనకారులు రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రిని సైతం ధ్వంసం చేశారు. అక్కడి ప్రభుత్వ విధానాలపై మొదలైన నిరసనలు నేటితో నెలరోజులు పూర్తికావడంతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

ట్యాగ్స్​