హైదరాబాద్​లో బాంబు పేలుళ్ళకు కుట్ర.. ఉగ్రవాదులు అరెస్ట్​

By udayam on October 3rd / 6:11 am IST

దసరా ఉత్సవాల సమయంలో హైదరాబాద్​లో బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నిన పాకిస్థాన్​ ఉగ్రవాదులను హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. జాహిద్​ అనే వ్యక్తిని హైదరాబాద్​, ముసారాంబాగ్​లోని సిట్​, టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నేతలపై దాడులతోపాటు, పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యక్రమాల కోసం కొంతమంది యువకులను కూడా అతడు రిక్రూట్ చేసినట్లు తెలుస్తోంది. 15 ఇళ్లలో సోదాలు జరిపి.. దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న అబ్దుల్ జాహిద్‌ ను పోలీసులు అందుపులోకి విచారణ జరిపారు.ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాహిద్‌ తోపాటు.. మరో ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్​