న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది ఢిల్లీ పోలీసుల నిర్ణయానికే వదిలేస్తున్నట్టు ఇటీవల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.
దీంతో రైతు ప్రతినిధులతో పోలీసు ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు రిపబ్లిక్ డే నాడు రైతు సంఘాలు తలపెట్టిన ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ కు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు.
రింగ్ రోడ్ వెంబడి ప్రశాంతంగా పరేడ్ జరుపుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అనుమతి విషయం పోలీసులు చూసుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.