తెలంగాణ: డిసెంబర్​ 31న రాత్రి 1 గంట వరకూ బార్లు, పబ్​ లకు అనుమతి

By udayam on December 29th / 1:00 pm IST

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. బార్లు, పబ్బులు, వైన్ షాపులు తెరిచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు పర్మిషన్ ఉండగా.. దీనిని డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు బార్లు తెరచుకోవచ్చని చెప్పింది.

ట్యాగ్స్​