రాష్ట్రంలో బానిసత్వం అనుభవిస్తున్న పోలీసులను చూస్తుంటే తనకు జాలేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ మాట్లాడాలో చెప్పాలంటూ పోలీసులను అడిగినా… పోలీసులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగించారు.