కుప్పంలో టీడీపీ, పోలీసుల మధ్య ఉద్రిక్తత

By udayam on January 4th / 11:10 am IST

చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మీద ఉత్కంఠ నెలకొంది. సభలు, రోడ్ షోలకు అనుమతులు లేవంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను పోలీసులు అడ్డుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు రోడ్‌ షో చేపట్టనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు వస్తుండటంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇటీవల చంద్రబాబు ర్యాలీల్లో కొందరు మరణించడంతో, రోడ్ షోలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది.

ట్యాగ్స్​