బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతలను పోలీసులు కాపాడారు. ఒడ్డుకు తీసుకొచ్చిన వారిద్దరికీ సిపిఆర్ చేసిన బీట్ కానిస్టేబుల్స్ వారికి పునర్జన్మను ప్రసాదించారు. స్థానికులు సైతం సిపిఆర్ చేయడంలో పోలీసులకు సాయం చేశారు. దీంతో వీరిద్దరూ కాసేపటికి స్పృహ లోకి వచ్చారు. వెంటనే వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాపట్ల: సముద్రంలో మునిగిన ఇద్దరు మహిళలు.. సిపిఆర్ తో ప్రాణాలు నిలబెట్టిన పోలీసుpic.twitter.com/PKSpOjsEZJ#Bapatla #Beach #Police #CPR #AndhraPradesh
— Udayam News Telugu (@udayam_official) November 23, 2022