టాలీవుడ్ కింగ్ నాగార్జున, అందాలభామ పూజా హెగ్డే ఇప్పటివరకు ఒక్క సినిమాలోనూ కలిసి నటించలేదు. అయితే, ఇప్పుడు వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ కోసం జతకట్టారు. ఇటీవలే ఈ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ జరిగింది. ఇదొక ఫ్రూట్ జ్యూస్ డ్రింక్. ఈ సాఫ్ట్ డ్రింక్ వాణిజ్య ప్రకటనకు అర్జున్ మాలిక్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ యాడ్ ప్రసార మాధ్యమాల్లో సందడి చేయనుంది. సినిమాల పరంగా నాగార్జున ఎలాంటి కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు.. పూజా మాత్రం మహేష్, త్రివిక్రమ్ మూవీ కోసం సిద్ధమవుతోంది.