పోప్​: వస్తానన్నా.. రష్యా పిలవట్లేదు

By udayam on May 3rd / 11:59 am IST

ఉక్రెయిన్​పై యుద్ధం మొదలైన తర్వాత రష్యా వస్తానని సందేశం పంపినా క్రెమ్లిన్​ నుంచి ఎలాంటి సమాధానం లేదని పోప్​ ఫ్రాన్సిస్​ విచారం వ్యక్తం చేశారు. ఇటలీ న్యూస్​ పేపర్​ కొరియేరా డెల్లా సీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పుతిన్​ను కలుస్తానని సందేశం పంపినా ఎలాంటి రిప్లై రాలేదు. రష్యా ఆర్థోడాక్స్​ చర్చ్​ అధిపతి పేట్రియార్క్​ కిరిల్​తో ఇటీవల 40 నిమిషాలు మాట్లాడా. రష్యా దాడిని ఆయన సమర్ధించడం నాకు విస్మయాన్ని కలిగించింది’ అని వెల్లడించారు.

ట్యాగ్స్​