విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా బిచ్చగాడు-2. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపు కుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ నెట్ వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. 2023లో వేసవిలో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమౌతోంది. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు.