ఢిల్లీ కారు బీభత్సం కేసు: మృతురాలిపై అత్యాచారం జరగలేదంటూ పోస్ట్​ మార్టం రిపోర్ట్​

By udayam on January 3rd / 10:16 am IST

దేశ రాజధానిలో జరిగిన అత్యంత దారుణ యాక్సిడెంట్​ లో మరణించిన మహిళపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోస్ట్​ మార్టం రిపోర్ట్​ వెల్లడించింది. సుల్తాన్​ పురి ప్రాంతంలో 20 ఏళ్ళ మహిళను కొందరు వ్యక్తులు కారుతో గుద్దేసి 13 కి.మీ.లు ఈడ్చుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మందుకొట్టి, మ్యూజిక్​ ను పెద్ద శబ్దంతో వింటుండంతో వారి కారుకు అమ్మాయి తగులుకుందన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోలేదు. ఈ ఘటనలపై పలు అనుమానాలు రేకెత్తగా ఆమెకు జరిపిన పోస్ట్​ మార్టంలో అమ్మాయిపై అఘాయిత్యం జరగలేదని తేల్చింది.

ట్యాగ్స్​