ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటిస్తున ఈ మూవీ నైజాం రైట్స్ రూ.70 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. దిశాపఠానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ని ఇంత భారీ మొత్తం వెచ్చించి కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరా? అని టాలీవుడ్ లో చర్చ మొదలైంది. రిలీజ్ డేట్ కూడా ఇంకా ఫైనల్ కాని ఈ మూవీపై ఉన్న క్రేజ్ ను ఈ గాసిప్ తో అర్ధం చేసుకోవచ్చు.