టాలీవుడ్​ మోస్ట్​ పాపులర్​ స్టార్​ గా ప్రభాస్​

By udayam on November 18th / 10:46 am IST

బాహుబలితో పాన్​ ఇండియా స్టార్​ గా మారిపోయిన డార్లింగ్​ ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయ్యింది. తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్‌గా రెబెల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. అక్టోబరు నెలకి సంబంధించి ఓర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో ప్రభాస్‌కే ఎక్కువ మంది ఓటేశారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఆరో స్థానములో , నాని ఏడు స్థానంలో విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలవగా.. మెగాస్టార్ చిరంజీవి 9వ స్థానానికి పడిపోయారు. వెంకటేశ్ పదో స్థానంలో నిలిచారు. టాప్-10లో నందమూరి బాలకృష్ణ , అక్కినేని నాగార్జున చోటు దక్కించుకోలేకపోయారు.

ట్యాగ్స్​