హోంబేల్​ : జనవరికి సలార్​ షూట్​ కంప్లీట్​ చేస్తాం

By udayam on December 24th / 4:43 am IST

ప్రభాస్​ ఫ్యాన్స్​ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీస్​ లో ‘సలార్​’ ఒకటి. కేజీఎఫ్​ సిరీస్​ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్​ నీల్​ ఈ మూవీకి దర్శకుడు కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే షూటింగ్​ జరుగుతుందని తప్ప ఏ ఒక్క అప్డేట్​ రాని ఈ మూవీ పై నిర్మాతలు హోంబేల్​ ఫిలింస్​ క్రేజీ న్యూస్​ బయటకు చెప్పింది. ఈ మూవీ షూటింగ్​ ఇప్పటికే 85 శాతం పూర్తయిందని, జనవరి లో జరిగే చివరి షెడ్యూల్​ తో షూటింగ్​ కంప్లీట్​ అవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్​ 28న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్​