ప్రహ్లాద్​ జోషి: మా ఓటు బ్యాంకు చూడలేకే దాడులు

By udayam on November 18th / 11:43 am IST

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బిజెపికి వచ్చిన ఓట్ల శాతాన్ని చూసి ఓర్వలేకే టిఆర్​ఎస్​ నాయకులు తమ నేతల ఇళ్ళపై దాడికి దిగుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి విమర్శించారు. నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్​ ఇంటిపై దాడి ఘటనను ఖొండించిన ఆయన.. టిఆర్​ఎస్​ నేతలు కేటీఆర్​, కవితల్లో ఎవరు తమ పార్టీలోకి వచ్చినా వెల్కమ్​ చెబుతామని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్​ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఈ సిఎం.. ప్రధాని వస్తే ముఖం చూపించలేని పిరికివాడన్నారు.

ట్యాగ్స్​