దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్ళడానికి ‘జన్ సురాజ్’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘గత కొన్నేళ్ళుగా తాను ప్రజా ప్రయోజన విధానాలను రూపొందించడం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలలో పాలు పంచుకున్నా. ఇప్పుడు ప్రజల దగ్గరకే నేరుగా వెళ్ళాలని భావిస్తున్నా. దీనికి సమాధానమే బీహార్ నుంచి ప్రారంభం కానున్న జన్ సురాజ్’ అని పేర్కొన్నారు.