ఫుల్ స్వింగ్లో .. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీప్రొడక్షన్ వర్క్స్​

By udayam on December 30th / 6:39 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రాబోతున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పూజా కార్యక్రమాలతో ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హరీష్ – పవన్ ల కలయికలో గతంలో వచ్చిన గబ్బర్​ సింగ్​ ఇండస్ట్రీ హిట్​ కావడంతో ఇప్పుడీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ట్వీట్ రూపంలో హరీష్ తెలియచేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంటూ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో డీప్ డిస్కషన్స్ లో మునిగిపోయిన పిక్స్ ను షేర్ చేసారు.

ట్యాగ్స్​