రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్)లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2025 మార్చి నాటికి అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, ఆ ప్రకారమే రాష్ట్రప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.