ఎపిలో 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కీలక ముందుడుగు పడింది. కొత్త జిల్లాల ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ చీఫ్ సెక్రటరీకి అందించారు. దీంతో త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రతీ లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా, అరకును రెండు జిల్లాలుగా విభజించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఎపిలో కొత్తగా మరో 13 జిల్లాలు రానున్నాయి.