వాషింగ్టన్​లో ఎమెర్జెన్సీ

సంతకం పెట్టిన డొనాల్డ్​ ట్రంప్​

By udayam on January 12th / 6:16 am IST

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆ దేశ రాజధాని వాషింగ్టన్​, కొలంబియా జిల్లా వ్యాప్తంగా అత్యవసర స్థితిని విధించినట్లు వైట్​హౌస్​ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కొత్త అధ్యక్షుడు జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేయబోయే సమయంలో గతవారం జరిగిన అల్లర్లు తిరిగి చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్​ నివేదికల ఆధారంగా ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో వాషింగ్టన్​లో జనవరి 11 నుంచి 24 వరకూ అత్యవసర స్థితి అమలులో ఉండనుంది. జనవరి 20న కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

అత్యవసర స్థితి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫెడరల్​ సైన్యం ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.