వెంకన్న సేవలో రాష్ట్రపతి ముర్ము

By udayam on December 5th / 10:06 am IST

తిరుమల వేంకటేశ్వరస్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా భూ వరాహస్వామిని దర్శించుకున్న ఆమె ఆ తర్వాత తిరుమల ఆలయానికి చేరుకున్నారు. ఆమెకు అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి రాష్ట్రపతి నమస్కరించిన అనంతరం వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ముర్ముతోపాటు పెద్దజీయంగార్‌ స్వామి, చిన్నజీయంగార్‌ స్వామి, టిటిడి ఛైర్మన్​ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

ట్యాగ్స్​