భద్రాద్రి రాముని సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

By udayam on December 28th / 9:18 am IST

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొద్ది సేపటి క్రితం భద్రాచలం చేరుకున్నారు. ఆమెకు పాటు తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. భద్రాద్రి రాముని ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్​