దేవుడి ఆధార్​ కార్డ్​ తెమ్మన్నారు

By udayam on June 9th / 10:49 am IST

దేవుడికి చెందిన భూమిలో పండిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద అమ్మబోయిన పంతులుకి ఝలక్​ తగిలింది. ఉత్తరప్రదేశ్లోని బంద ప్రాంతంలోని రామ్​ జానకి టెంపుల్​ పేరిట 7 ఎకరాల మాగాణి ఉంది. అందులో పండిన 100 క్వింటాళ్ళ గోధుమల్ని తీసుకుని ఆ గుడి ప్రధాన అర్చకుడు మహంత్​ రామ్​కుమార్​ దాస్​ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. అయితే ఈ పంటను కొనుగోలు చేయడానికి భూమి యజమాని ఆధార్​ కార్డ్​ తప్పనిసరి అని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో దేవుడికి ఆధార్​ కార్డ్​ ఎక్కడి నుంచి తెమ్మంటారంటూ వెనుదిరిగాడు.

ట్యాగ్స్​