బ్యాడ్​ న్యూస్​ చెప్పిన కాంతార టీమ్​

By udayam on November 24th / 9:16 am IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటిటి ప్రేక్షకుల..ఎదురుచూపులు తెరపడింది. కాంతారా మూవీ ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ మూవీ చూసే వారికి ఓ బ్యాడ్ న్యూస్.ఈ సినిమాలో కీలక హైలైట్ గా నిలిచిన ఘట్టం.. రిషబ్ శెట్టి భూతకోల ఆడే సీన్..ఈ సీన్ లో ‘వరాహ రూపం దైవ వరీష్టం..’ అంటూ ఓ పాట బ్యాగ్రౌండ్ లో వినిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తూ వుంటుంది. రీసెంట్ గా ఈ పాటపై వివాదం చెలరేగడంతో మేకర్స్ ఆ పాటని కట్ చేసి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్​ చేస్తున్నారు.ది ఇప్పడు ఓటీటీ వెర్షన్ లో లేకపోవడంతో ‘కాంతార’ అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమాకు ఆయువు పట్టులాంటి సీన్ నే లేపేయడం దారుణమని.. ఈ మూవీ ఆత్మను చంపేసినట్లు ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​