ప్రధాని రేసు నుంచి తప్పుకున్న ప్రీతి పటేల్​

By udayam on July 13th / 5:21 am IST

యుకె ప్రధాని రేసు నుంచి భారతీయ సంతతి ప్రీతి పటేల్​ తప్పుకున్నారు. దీంతో మరో భారతీయుడు రిషి సనక్​కు బ్రిటన్​ ప్రధాని పదవి చేపట్టే అవకాశం మరింత పెరగనుంది. బ్రిటన్​కు హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్​.. బ్రిటన్​ ఈయూ నుంచి తప్పుకున్న బ్రెగ్జిట్​ రిఫరెండంలో కీలకంగా వ్యవహరించారు. బోరిస్​ జాన్సన్​ తప్పుకున్న అనంతరం బ్రిటన్​ ప్రధాని రేసులో నిలిచిన ఆమెకు కేవలం 1.7 శాతం మాత్రమే అవకాశం ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో ఆ రేసు నుంచి తప్పుకున్నారు. రిషి సనక్​కు 12.1 శాతం అవకాశం ఉండగా.. మోర్డాంట్​కు 19.6, బడెనాక్​కు 18.7 శాతం ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్స్​