భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

By udayam on November 24th / 12:16 pm IST

రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. గురువారం ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహల్‌ మాట్లాడుతూ.. అడుగులు ఇప్పుడు బలంగా ఉంటాయని అన్నారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో తాము గెలిచినప్పటికీ .. ఆపరేషన్‌ కమలం పేరిట బిజెపి 20-25 ఎమ్మెల్యేలను కోట్లకు కోట్లు చెల్లించి తమ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య మార్గాలన్నీ మూసుకుపోయాయని.. అందుకోసమే ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్​