కొవిడ్​ బారిన ప్రియాంక గాంధీ

By udayam on June 3rd / 7:54 am IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత ప్రియాంక గాంధీ వాద్రా సైతం కొవిడ్​ బారిన పడ్డారు. కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం గురువారం కొవిడ్​ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజునే ప్రియాంకకు సైతం కొవిడ్​ పాజిటివ్​గా రావడంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రియాంక ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు కాంగ్రెస్​ పార్టీ ట్వీట్​ చేసింది.

ట్యాగ్స్​