ఫుట్​ బాల్​ వరల్డ్​ కప్​​: ప్రైజ్​ మనీ చూస్తే షాకవ్వాల్సిందే

By udayam on December 16th / 11:39 am IST

ఈ ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్లో గెలిచిన జట్టుకు ఏకంగా రూ.340 కోట్ల ప్రైజ్​ మనీ దక్కనుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్​ జట్లు ఇప్పటికే ఫైనల్​ బెర్త్​ ను కన్ఫర్మ్​ చేసుకున్న సంగతి తెలిసిందే. రన్నరప్​ గా నిలిచిన జట్టుకు రూ.250 కోట్లు దక్కనున్నాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.223 కోట్లు, 4వ స్థానంలో ఉన్న జట్టుకు రూ.200 కోట్ల ప్రైజ్​ మనీ దక్కనుంది. క్వార్టర్స్​ చేరిన బ్రెజిల్​, నెదర్లాండ్స్​, పోర్చుగల్​, ఇంగ్లాండ్​ జట్లకు రూ.140 కోట్ల చొప్పున ప్రైజ్​ మనీ అందనుంది. గ్రూప్​ 16 చేరిన జట్లకు రూ.107 కోట్లు, పార్టిసిపేషన్​ జట్లకు రూ.75 కోట్ల ప్రైజ్​ మనీ అందనుంది.

ట్యాగ్స్​