సి.కళ్యాణ్​: సినీ కార్మికుల వేతనాలు పెంచుతాం

By udayam on June 22nd / 10:30 am IST

వేతనాల పెంపు కోసం సమ్మె బాట పట్టిన టాలీవుడ్​ కార్మికులకు తెలుగు సినీ నిర్మాతల మండలి గుడ్​న్యూస్​ చెప్పింది. నిర్మాత సి.కళ్యాణ్​ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. సమ్మెను విరమించి రేపటి నుంచి వారంతా షూటింగ్​లలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె జరుగుతుందన్న విషయం తెలిసి షాక్​ అయ్యామని, కలిసి చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇలా ఆకస్మికంగా సమ్మెకు దిగితే నిర్మాతలకు చాలా నష్టమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​