ఈ కాంబో నిజం కాదట

By udayam on December 28th / 4:52 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – పుష్ప ఫేమ్ సుకుమార్ కలయికలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతుందని..ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్నట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ వార్తల ఫై అభిషేక్ పిక్చర్స్ వారు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని , ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. తమ బ్యానర్ నుంచి ఎప్పటికప్పుడు మంచి చిత్రాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటామనీ, ఆ విషయాలను అధికారికంగా తాము తెలియజేస్తూ ఉంటామని అన్నారు. పుకార్లను నమ్మొద్దని తెలిపారు.

ట్యాగ్స్​