అమెరికాలో మరో నల్ల జాతీయుడి కాల్చివేత

By udayam on April 12th / 6:30 am IST

ట్రాఫిక్​ రూల్స్​ పాటించలేదన్న చిన్న కారణంతో అమెరికాలో డ్యుతే రైట్​ (20) అనే ఓ నల్లజాతీయుడ్ని అక్కడి పోలీసులు కాల్చి చంపేశారు. జార్జ్​ ఫ్లాయిడ్​ కేసు విషయంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిరసనలు జరుగుతున్న మిన్నెసోటాలోనే తాజా సంఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని కర్ఫ్యూ విధించారు. అతడు చేసిన నేరమల్లా పోలీసులు ఆపినప్పుడు కారును ఆపకపోవడమే. పారిపోతున్న అతడి కారుపై కాల్పులు జరిపి పోలీసులు అతడిని పొట్టనపెట్టుకున్నారు.

ట్యాగ్స్​