ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌లో చోటుదక్కింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో విజయసాయి రెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేర్చారు. ఆయనతో పాటు పీటీ ఉషను కూడా ఈ ప్యానల్‌లో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.