INDvsBAN: తొలిరోజు భారత్​ స్కోర్​ 278.. పుజారా సెంచరీ మిస్​

By udayam on December 14th / 1:01 pm IST

బంగ్లాదేశ్​ తో జరుగుతున్న తొలి టెస్ట్​ లో భారత్​ తొలి రోజు ఆటను 278/6 వద్ద ముగించింది. ఓ దశలో 48 కే గిల్​(20), రాహుల్ (22)​, కోహ్లీ (1) వికెట్లు కోల్పోయిన జట్టును పంత్​ (46) తన ఫాస్ట్​ బ్యాటింగ్​ తో ఆదుకుని అర్ధ సెంచరీకి 4 పరుగుల దూరంలో స్టంపౌంట్​ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ (82*) తో కలిసి పుజారా (90) ఇన్నింగ్స్​ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో సెంచరీకి 10 పరుగుల దూరంలో పుజారా తైజుల్​ బౌలింగ్​ లో క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్​ పటేల్​ కూడా 14 పరుగులకు ఔట్​ అయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్​ 3, మెహదీ హసన్​ 2, ఖలీద్​ ఒక వికెట్​ తీశారు.

ట్యాగ్స్​