పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తెలంగాణ సిఎం కేసీఆర్ ను మంగళవారం కలుసుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలను కలిసేందుకు భగవంత్ మాన్ వచ్చారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరిగింది. అనంతరం వీరిద్దరి మధ్యా జాతీయ రాజకీయాలపైనా కాసేపు చర్చ నడిచింది. అయితే వీరిద్దరి ఏ ఏ అంశాలపై చర్చించారన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు.