పంజాబ్​ : పాఠశాలలకు కులం పేర్లు తొలగించిన సర్కార్​

By udayam on December 31st / 5:24 am IST

కులం, కమ్యూనిటీకి సంబంధించిన పేర్లు ఉన్న 56 ప్రభుత్వ పాఠశాలలకు పేర్లు మార్చాలని పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశించింది. నిర్దిష్ట కులం లేదా కమ్యూనిటీ పేరు లేదా అభ్యంతరకరమైన పదాలు కలిగి ఉన్న పాఠశాలల జాబితాను సమర్పించాల్సిందిగా గత నెల రాష్ట్ర విద్యాశాఖను పంజాబ్‌ విద్యాశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బైన్స్‌ ఆదేశించారు. అయితే ఇది కేవలం మైనారిటీ వర్గాలకు చెందిన పాఠశాలల పేర్లను మాత్రమే తొలగించాలని ఆదేశించడం గమనార్హం. జిల్లాల నుండి అందిన ఇన్‌పుట్‌లను అనుసరించి విద్యాశాఖ రూపొందించిన నివేదిక ప్రకారం.. సుమారు 56 ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు.

ట్యాగ్స్​